Share News

Gold and Silver Price: పెళ్లిళ్ల సీజన్‌లో గుడ్ న్యూస్..

ABN , Publish Date - Feb 14 , 2024 | 06:54 AM

అసలే పెళ్లిళ్ల సీజన్.. కాబట్టి బంగారం ధర తగ్గితే బాగుండు అనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బంగారం ధర ఏమీ బీభత్సంగా తగ్గలేదు. పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా పెరిగింది.

Gold and Silver Price: పెళ్లిళ్ల సీజన్‌లో గుడ్ న్యూస్..

Gold and Silver Price: అసలే పెళ్లిళ్ల సీజన్.. కాబట్టి బంగారం ధర తగ్గితే బాగుండు అనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బంగారం ధర ఏమీ బీభత్సంగా తగ్గలేదు. పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా పెరిగింది. మరి గుడ్ న్యూస్ ఎలా అవుతుందని అంటారా? బంగారం ధర పెరగడం లేదు కాబట్టి. ఒకవేళ పెరిగినా రూ.10 కి మించి పెరగడం లేదు. తగ్గినా అంతే తగ్గుతోంది కాబట్టి అసలు దానిని పరిగణలోకి తీసుకోలేం.

ఇక బంగారం ధర నేడు అయితే రూ.10 తగ్గింది. గత కొన్ని రోజులుగా బంగారం ధర ఇలాగే మెయిన్‌టైన్ అవుతూ వస్తోంది. ఇక వెండి విషయానికి వస్తే.. ఇక వెండి ధర సైతం ఎప్పటి మాదిరిగానే కిలోపై రూ.100 తగ్గింది. నేడు హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57.590 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830గా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో కిలో వెండి ధర రూ.75,400గా ఉంది.

Updated Date - Feb 14 , 2024 | 06:54 AM