Share News

Gold and Silver Price: ఈ విషయం తెలిస్తే కొనుగోలుదారులు హ్యాపీ ఫీలవుతారు..

ABN , Publish Date - Feb 11 , 2024 | 06:57 AM

కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలో నేడు ఎలాంటి మార్పూ లేదు. ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. కనీసం రూ.10 చొప్పున అయినా పెరగడమో, తగ్గడమో జరుగుతోంది కానీ స్థిరంగా ఉన్నది మాత్రం లేదు.

Gold and Silver Price: ఈ విషయం తెలిస్తే కొనుగోలుదారులు హ్యాపీ ఫీలవుతారు..

Gold and Silver Price: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలో నేడు ఎలాంటి మార్పూ లేదు. ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. కనీసం రూ.10 చొప్పున అయినా పెరగడమో, తగ్గడమో జరుగుతోంది కానీ స్థిరంగా ఉన్నది మాత్రం లేదు. ఇక వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. నేడు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 గ్రాముల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950గా ఉంది. ఇక నేడు కిలో వెండి ధర రూ.75,000 ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో కిలో వెండి ధర వచ్చేసి రూ.76,500గా ఉంది. ఏది ఏమైనా అటు బంగారం, ఇటు వెండి ధరలో మార్పేమీ లేకపోవడమనేది వినియోగదారులు సంతోషించాల్సిన విషయమే.

Updated Date - Feb 11 , 2024 | 06:57 AM