Share News

Gold and Silver Price: ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:49 AM

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో రోజువారీ మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కూడా బంగారం, వెండి ధరల్లో మార్పు వచ్చింది. అది పరిగణలోకి కూడా తీసుకోలేనంత మార్పు. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గితే 10 గ్రాములపై రూ.10 తగ్గుతున్న విషయం తెలిసిందే.

Gold and Silver Price: ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో రోజువారీ మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కూడా బంగారం, వెండి ధరల్లో మార్పు వచ్చింది. అది పరిగణలోకి కూడా తీసుకోలేనంత మార్పు. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గితే 10 గ్రాములపై రూ.10 తగ్గుతున్న విషయం తెలిసిందే. పెరిగినా రూ.10 పెరుగుతోంది. ఇవాళ కూడా బంగారం ధర తగ్గింది. ఎంతో తెలుసా? అదే రూ.10. ఇక నేడు హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,690 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,940గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధరపై రూ.100 తగ్గింది. ఇవాళ హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో కిలో వెండి ధర రూ.77,100 గా ఉంది.

Updated Date - Feb 13 , 2024 | 06:49 AM