Share News

Gold and Silver Prices: పండుగ వేళ మళ్లీ పెరిగిన పసిడి రేట్లు..ఈసారి ఏంతంటే

ABN , Publish Date - Apr 09 , 2024 | 11:54 AM

భారత్‌లో బంగారం(gold) ధరలు(rates) క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా నేడు(ఏప్రిల్ 9న) కూడా మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో బంగారం ధర రూ.71,000 పైకి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‍‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.71,620 ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.71,730కి చేరింది.

Gold and Silver Prices: పండుగ వేళ మళ్లీ పెరిగిన పసిడి రేట్లు..ఈసారి ఏంతంటే
gold rate today hyderabad

భారత్‌లో బంగారం(gold) ధరలు(rates) క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా నేడు(ఏప్రిల్ 9న) కూడా మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో బంగారం ధర రూ.71,000 పైకి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‍‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.71,620 ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.71,730కి చేరింది. ఏకంగా 110 రూపాయలు పెరిగింది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు నిన్న రూ.65,650 ఉండగా, ప్రస్తుతం రూ.65,750కి ఎగబాకింది. ఇది నిన్నటి రేటుతో పోల్చితే 100 రూపాయలు పెరగడం విశేషం. ఇలా క్రమంగా పుత్తడి రేట్లు పెరగడం పట్ల బంగారం కొనుగోలు చేయాలని చుస్తున్న వారు షాక్ అవుతున్నారు. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చుద్దాం.


ప్రధాన నగరాల్లో పుత్తడి రేట్లు

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,730

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,900, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,880

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,730

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,760

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,730

కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,730

వెండి(Silver) ధరలు

ఇక దేశంలో ఒక కిలో వెండి(silver) రూ.84,500కు చేరింది. కాగా నిన్న ఈ ధర కిలో రూ.84,500 గానే ఉంది. దీంతో వెండి ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. కానీ హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.88000గా ఉంది.


ఇవి కూడా చదవండి:

Bike: మీ బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతుందా.. అయితే ఈ తప్పులు చేయకండి


Money Management: 7 మనీ మేనేజ్‌మెంట్ టిప్స్.. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోండిలా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 09 , 2024 | 11:56 AM