Gold and Silver Price: పైపైకి వెళ్తున్న పుత్తడి రేట్లు..నేటి ధరలు ఏంతంటే
ABN , Publish Date - Apr 07 , 2024 | 08:54 AM
దేశంలో రోజురోజుకు పుత్తడి(gold) రేట్లు పైపైకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 రోజుల క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,500 ఉండగా, ఇప్పుడు రూ.71,290కి చేరింది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు నెల రోజుల క్రితం రూ.61,870 ఉండగా, ప్రస్తుతం రూ.65,350కి ఎగబాకింది.
దేశంలో రోజురోజుకు పుత్తడి(gold) రేట్లు పైపైకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 రోజుల క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,500 ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.71,290కి చేరింది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు నెల రోజుల క్రితం రూ.61,870 ఉండగా, ప్రస్తుతం రూ.65,350కి ఎగబాకింది. అయితే నిన్నటి రేటుతో పోల్చితే ఈరోజు గోల్డ్ ధరల్లో మార్పులు లేవు. కానీ నెల రోజుల్లోనే పుత్తడి దాదాపు ఐదు వేల రూపాయలు పెరగడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం కొన్ని చోట్ల 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు రూ.72 వేలు దాటాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ ధరలు
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,350, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,290
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,350, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,290
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,500, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,440
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,150, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,160
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,350, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,290
కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,350, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,290
వెండి(Silver) ధరలు
ఇక ఈరోజు భారతదేశంలో ఒక కిలో వెండిని(Silver) కొనాలంటే రూ.83,500 వెచ్చించాల్సిందే. కాగా నిన్న కూడా ఈ ధర కిలో రూ.83,500 గానే ఉంది. దీంతో వెండి ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు.
పైన పేర్కొన్న ధరలు సూచికగా మాత్రమే ఉంటాయి. GST సహా ఇతర ఛార్జీలను కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించవచ్చు. బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తారు.
ఇది కూడా చదవండి:
Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. ఇది మీకు తెలుసా?
SBI: ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా అదనపు ఆదాయం పొందండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం