Gold and Silver Price Updates: పసిడి ప్రియులకు షాకింగ్.. రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Jul 18 , 2024 | 06:28 AM
దేశంలో బంగారం (gold) కొనుగోలు దారులకు మళ్లీ షాకింగ్ న్యూస్. ఈసారి ఏకంగా 10 గ్రాముల పుత్తడి ధర రూ.980 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు (జులై 18న) ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,760కు చేరుకుంది.
దేశంలో బంగారం (gold) కొనుగోలు దారులకు మళ్లీ షాకింగ్ న్యూస్. ఈసారి ఏకంగా 10 గ్రాముల పుత్తడి ధర రూ.980 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు (జులై 18న) ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,760 కాగా, 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.75,010కి చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.75,160కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 68,910కు చేరింది. మరోవైపు వెండి(silver) ధరలు కేజీకి రూ. 1200 పెరిగి ఢిల్లీలో రూ.96,100కు చేరుకున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకడం విశేషం.
ప్రధాన ప్రాంతాల్లో 10 గ్రాముల పుత్తడి రేట్లు (24 క్యారెట్లు), (22క్యారెట్లు)
చెన్నైలో రూ. 75,500, రూ. 69,210
హైదరాబాద్‌లో రూ. 75,010, రూ. 68,760
విజయవాడలో రూ. 75,010, రూ. 68,760
ఢిల్లీలో రూ.75,160, రూ. 68,910
ముంబైలో రూ. 75,010, రూ. 68,760
వడోదరలో రూ. 75,060, రూ. 68,810
కేరళలో రూ. 75,010, రూ. 68,760
బెంగళూరులో రూ. 75,010, రూ. 68,760
కోల్‌కతాలో రూ. 75,010, రూ. 68,760
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కేజీ వెండి ధరలు
ఢిల్లీలో రూ. 96,100
చెన్నైలో రూ. 100,600
ముంబైలో రూ. 96,100
హైదరాబాద్‌లో రూ. 100,600
విజయవాడలో రూ. 100,600
బెంగళూరులో రూ. 94,850
కోల్‌కతాలో రూ. 96,100
కేరళలో రూ. 100,600
వడోదరలో రూ. 96,100
అయితే అమెరికాలో వడ్డీ రేటు తగ్గే అవకాశం మళ్లీ ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగింది. అంతకుముందు ఏప్రిల్, మే నెలల్లో కూడా ధరలు పలుమార్లు ఎగువ స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో కూడా జూన్‌లో వడ్డీ రేటు తగ్గే అవకాశం పెరిగింది. కానీ ఈ అవకాశం బలహీనపడటంతో మే, జూన్ చివరి వారంలో ధరల్లో కరెక్షన్ కనిపించింది. మరోవైపు ప్రపంచ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు రికార్డు స్థాయి $2,482.29కి చేరుకుంది. US ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ట్రేడింగ్‌లో ఔన్స్‌కి $ 2,487.40 వద్ద కొత్త రికార్డు స్థాయిలో కనిపించింది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 20 శాతం పెరిగాయి.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇవి కూడా చదవండి:
Budget 2024: బడ్జెట్ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!
రియల్టీలోకి పీఈ పెట్టుబడులు రూ.25,000 కోట్లు
For Latest News and Business News click here