Gold and Silver Prices: రూ.63 వేలు దాటిన బంగారం ధర..
ABN , Publish Date - Feb 02 , 2024 | 09:05 AM
బంగారం, వెండి ధరలు మోత మోగిస్తున్నాయి. బంగారం ధర 10 గ్రాములు ఏకంగా 63 వేలు దాటేసింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాస్త బంగారం, వెండి ధరలు తగ్గితే బాగుండని చూసే వారికి ఆందోళన రేకెత్తిస్తాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సహజమే కానీ ధరలు పెరిగితేనే ఇబ్బందికరంగా మారుతుంది.
Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు మోత మోగిస్తున్నాయి. బంగారం ధర 10 గ్రాములు ఏకంగా 63 వేలు దాటేసింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాస్త బంగారం, వెండి ధరలు తగ్గితే బాగుండని చూసే వారికి ఆందోళన రేకెత్తిస్తాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సహజమే కానీ ధరలు పెరిగితేనే ఇబ్బందికరంగా మారుతుంది. నేడు బంగారం ధర అయితే చాలా స్వల్పంగా పెరిగింది. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.150 పెరిగి రూ.58,150కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,440కి చేరింది. వెండి ధర విషయానికి వస్తే.. కిలోపై రూ.200 తగ్గి రూ.76,300కి చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖలో వెండి, బంగారం ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,440కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే కిలో ధర రూ.77.800గా ఉంది.