Gold And Silver Prices: మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయ్.. చెక్ చేసుకోండి!
ABN , Publish Date - Apr 27 , 2024 | 07:42 AM
బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పుత్తడి ధరలు క్రమంగా తగ్గగా, ఆ తర్వాత మాత్రం ప్రతిరోజు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు (ఏప్రిల్ 27న) కూడా పసిడి ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశంలో బంగారం ధర గత 24 గంటల్లో రూ.440 పెరిగింది.
బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పుత్తడి ధరలు క్రమంగా తగ్గగా, ఆ తర్వాత మాత్రం ప్రతిరోజు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు (ఏప్రిల్ 27న) కూడా పసిడి ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశంలో బంగారం ధర గత 24 గంటల్లో రూ.440 పెరిగింది.
ఏప్రిల్ 27, 2024న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 72,710 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 66,650గా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉదయం 7.30 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,720కి చేరుకుంది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు రూ.66,660గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
నగరం 24 క్యారెట్, 22 క్యారెట్
హైదరాబాద్ రూ.72,720 రూ.66,660
ఢిల్లీ రూ.72,860 రూ.66,800
ముంబై రూ.72,710 రూ.66,650
చెన్నై రూ.73,690 రూ.67,550
కోల్‌కతా రూ.72,710 రూ.66,650
బెంగళూరు రూ.72,710 రూ.66,650
భువనేశ్వర్ రూ.72,710 రూ.66,550
గత 24 గంటల్లో వెండి ధర కూడా పెరిగింది. ఏప్రిల్ 27, 2024న కిలో వెండి ధర రూ.84,600గా ఉంది. ఇది నిన్న రూ.84,500గా ఉండేది. వెండి ధర ఈరోజు 100 రూపాయలు మాత్రమే పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.88,100 ఉండగా, ఇది నిన్న 88 వేలుగా ఉండేది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది. అంతేకాదు GST, TCS, ఇతర ఛార్జీలు వీటిలో కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి.
ఇది కూడా చదవండి:
Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్
Shyam Pitroda: సంపన్నులు చనిపోతే వారి సంపద తీసుకునే చట్టం రూపొందించాలి
Read Latest Business News and Telugu News