Gold and Silver Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Jul 10 , 2024 | 06:29 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతున్న వేళ బంగారం(gold), వెండి(silver) ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 10న) దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.73,340కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67,240కి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతున్న వేళ బంగారం(gold), వెండి(silver) ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 10న) దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.73,340కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67,240కి చేరుకుంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.73,190గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67,090గా ఉంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వెండి రేట్లు కూడా కిలోకు 180 రూపాయలు తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన ప్రాంతాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
చెన్నైలో రూ. 73,840, రూ. 67,690
హైదరాబాద్‌లో రూ. 73,190, రూ. 67,090
విజయవాడలో రూ. 73,190, రూ. 67,090
ఢిల్లీలో రూ.73,340, రూ. 67,240
ముంబైలో రూ. 73,190, రూ. 67,090
వడోదరలో రూ. 73,240, రూ. 67,140
కోల్‌కతాలో రూ. 73,190, రూ. 67,090
బెంగళూరులో రూ. 73,190, రూ. 67,090
కీలక నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
చెన్నైలో రూ. 98,900
ఢిల్లీలో రూ. 94,400
హైదరాబాద్‌లో రూ. 98,900
విజయవాడలో రూ. 98,900
కోల్‌కతాలో రూ. 95,200
బెంగళూరులో రూ. 93,800
వడోదరలో రూ. 94,400
కేరళలో రూ. 94,400
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
ఈక్విటీ మదుపరుల సంపద రూ.451 లక్షల కోట్లు
సూక్ష్మ రుణాలు రూ.2 లక్షలు మించొద్దు
For Latest News and Business News click here