Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు
ABN , Publish Date - Jul 03 , 2024 | 07:37 AM
దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో నేడు (జులై 3న హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 120 పెరిగి రూ.66,360కి చేరుకుంది.
దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో నేడు (జులై 3న హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 120 పెరిగి రూ.66,360కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,390గా ఉంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,540గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 66,510కు చేరింది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్లు గురించి తెలుసుకుందాం.
బంగారం ధరలు (22 క్యారెట్లు, 24 క్యారెట్లు, 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 66,360, రూ.72,390
విజయవాడలో రూ. 66,360, రూ.72,390
చెన్నైలో రూ. 66,910, రూ.72,900
ఢిల్లీలో రూ. 66,510, రూ.72,540
ముంబైలో రూ. 66,360, రూ. 72,390
కోల్‌కతాలో రూ. 66,360, రూ. 72,390
బెంగళూరులో రూ.72,390, రూ. 72,390
వెండి రేట్లు
ఇక వెండి ధరల గురించి మాట్లాడితే ఈరోజు వెండి రేట్లు 800 రూపాయలు పెరిగాయి. దీంతో నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,100కి చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 95,600, ముంబైలో కిలో వెండి ధర రూ. 91,100, చైన్నైలో కిలో వెండి ధర రూ. 95,600, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 91,100, కేరళలో కిలో వెండి ధర రూ. 95,600కు చేరుకుంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ హస్తం
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ సఫీరో ఫారెక్స్ కార్డ్
For Latest News and Business News click here