Gold and Silver Rate: మళ్లీ షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు
ABN , Publish Date - Jun 16 , 2024 | 06:36 AM
బంగారం(gold), వెండి(silver) కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఎదురైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లలో రికవరీ కనిపిస్తోంది. రెండు రోజుల క్షీణత తర్వాత, మార్కెట్‌లో బలమైన పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 610 పెరిగి రూ. 66,500కి చేరుకుంది.
బంగారం(gold), వెండి(silver) కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఎదురైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లలో రికవరీ కనిపిస్తోంది. రెండు రోజుల క్షీణత తర్వాత, మార్కెట్‌లో బలమైన పెరుగుదల నమోదైంది. దీంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 610 పెరిగి రూ. 66,500కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.72,550గా ఉంది. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల ధోరణులతోపాటు పలు అంశాల నేపథ్యంలో భారత మార్కెట్లలో బంగారం ధరలు పెరిగాయి.
కీలక నగరాల్లో బంగారం ధరలు (22 క్యారెట్ల 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 66,500
విజయవాడలో రూ. 66,500
ఢిల్లీలో రూ. 66,650
ముంబైలో రూ. 66,500
చెన్నైలో రూ. 67,050
కోల్‌కతాలో రూ. 66,500
బెంగళూరులో రూ. 66,500
వడోదరలో రూ. 66,550
వెండి రేట్లు ఎలా ఉన్నాయ్
మరోవైపు దేశంలో వెండి రేట్లు కూడా కనిష్ట స్థాయి నుంచి కోలుకుని పైపైకి చేరాయి. ఈ క్రమంలో వెండి ధర కిలోకు 600 రూపాయలు పెరిగి రూ.91000కు చేరుకుంది. దీంతో ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 91,000, హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 95,600, ముంబైలో కిలో వెండి ధర రూ. 91,000, చైన్నైలో కిలో వెండి ధర రూ. 95,600, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 91,000, కేరళలో కిలో వెండి ధర రూ. 95,600, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 90,300కి చేరుకున్నాయి.
గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి:
For Latest News and Business News click here