Gold and Silver Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే
ABN , Publish Date - Jun 17 , 2024 | 06:25 AM
దేశవ్యాప్తంగా నేడు (జూన్ 17న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన ఈ రేట్లు కొంత ఉపశమనం కల్పించాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 10 తగ్గి రూ. 66,640కి చేరింది.
దేశవ్యాప్తంగా నేడు (జూన్ 17న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన ఈ రేట్లు కొంత ఉపశమనం కల్పించాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 10 తగ్గి రూ. 66,640కి చేరింది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 72,690గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 66,490గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి రేటు రూ.72,540కి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (22 క్యారెట్లు, 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 66,490
విజయవాడలో రూ. 66,490
ఢిల్లీలో రూ. 66,640
ముంబైలో రూ. 66,490
చెన్నైలో రూ. 67,040
కోల్‌కతాలో రూ. 66,490
బెంగళూరులో రూ. 66,490
వడోదరలో రూ. 66,540
వెండి ధరలు
మరోవైపు దేశంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి రేటు 100 రూపాయలు తగ్గి రూ. 90,900కు చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 95,500, ముంబైలో కిలో వెండి ధర రూ. 90,900, చైన్నైలో కిలో వెండి ధర రూ. 95,500, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 90,900, కేరళలో కిలో వెండి ధర రూ. 95,500, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 90,200, మంగుళూరులో కిలో వెండి రేటు రూ. 91,100, గోవాలో కేజీ వెండి ధర రూ. 91,100గా ఉన్నాయి.
అలర్ట్: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా బంగారం, వెండి కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే సమయంలో రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.
ఇది కూడా చదవండి:
Next Week Ipos: ఇన్వెస్టర్లకు పండుగే పండుగ.. వచ్చేవారం ఏకంగా 9 ఐపీఓలు
ITR Filing: కొత్త పన్ను రేటు వచ్చేసింది.. మినహాయింపులు, లాస్ట్ డేట్ తెలుసా
For Latest News and Business News click here