Gold and Silver Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే
ABN , Publish Date - Jun 01 , 2024 | 06:37 AM
పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. నిన్న 400 రూపాయలకు పైగా తగ్గిన బంగారం (gold) ధర, నేడు (జూన్ 1న) 150 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు చౌకగా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. నిన్న 400 రూపాయలకు పైగా తగ్గిన బంగారం (gold) ధర, నేడు (జూన్ 1న) 150 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు చౌకగా మారాయి. ఈ క్రమంలో నేడు ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.72,750కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690కి చేరుకుంది.
మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.72,600గా ఉండగా, 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,540కి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్ రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు)
హైదరాబాద్: రూ. 66,540
విజయవాడ: రూ. 66,540
ఢిల్లీ: రూ. 66,690
చెన్నై: రూ.67,140
ముంబై: రూ. 66,540
కోల్‌కతా: రూ. 66,540
బెంగళూరు: రూ. 66,550
అహ్మదాబాద్: రూ.66,690
వెండి రేటు ఎంత ?
ఈ నేపథ్యంలో నేడు వెండి(silver) ధరలు కూడా కిలోకు వెయ్యి రూపాయలు తగ్గి రూ.95,400కి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 95,400కు చేరగా, హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 99,900కు చేరుకుంది. దీంతోపాటు ముంబైలో కిలో వెండి ధర రూ. 95,400, చైన్నైలో కిలో వెండి ధర రూ. 99,900, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 95,400, కేరళలో కిలో వెండి ధర రూ. 99,900, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 95,700గా ఉంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
BOI : బీఓఐ 666 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest Business News and Telugu News