Share News

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:36 AM

దేశవ్యాప్తంగా నేడు(జూన్ 2న) బంగారం(gold) ధరలు మళ్లీ తగ్గడంతో ఆభరణ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న వారికి ఈ తగ్గుదల గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.200 తగ్గింది.

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
gold and silver rate updates june 2nd 2024

దేశవ్యాప్తంగా నేడు(జూన్ 2న) బంగారం(gold) ధరలు మళ్లీ తగ్గడంతో ఆభరణ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న వారికి ఈ తగ్గుదల గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధి మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.200 తగ్గింది. పతనం తర్వాత ఇప్పుడు 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,650కి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,700కి తగ్గింది. మరోవైపు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.72,550కి చేరగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,500కి చేరింది.


వెండి ధర

ఇక నేడు వెండి(silver) రేట్లు కూడా కిలోకు 1900 రూపాయలు తగ్గి రూ.93,500కు చేరుకున్నాయి. దీంతో ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 93,500, హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 98000, ముంబైలో కిలో వెండి ధర రూ. 93,500, చైన్నైలో కేజీ వెండి ధర రూ. 98000, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 93,500, కేరళలో కేజీ వెండి ధర రూ. 98,000కు చేరుకుంది.


గత 15 ఏళ్లలో బంగారం ధర గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో బంగారం ఒక నిత్యావసర వస్తువుగా మారింది. బంగారం డిమాండ్ దాని ధరలో హెచ్చుతగ్గులకు దారి తీస్తోంది. నేడు, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా బంగారం అతిపెద్ద వినియోగదారులలో ఒకటిగా ఉంది, ఇది అంతర్జాతీయ బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.


ఇది కూడా చదవండి:

గత నెల జీఎస్‌టీ ఆదాయం రూ.1.73 లక్షల కోట్లు


CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


Read Latest Business News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 06:37 AM