Gold and Silver Rate: ఎన్నికల ఫలితాల వేళ గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్
ABN , Publish Date - Jun 04 , 2024 | 12:56 PM
జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల మధ్య స్టాక్ మార్కెట్‌లో భారీ సందడి నెలకొంది. స్టాక్ మార్కెట్(stock market)లో రికార్డు పతనం ప్రభావం బంగారం, వెండి ధరలపై కనిపించింది. స్టాక్ మార్కెట్‌లో గందరగోళం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని(gold) ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల మధ్య స్టాక్ మార్కెట్‌లో భారీ సందడి నెలకొంది. దీంతో స్టాక్ మార్కెట్(stock market)లో రికార్డు పతనం ప్రభావం బంగారం, వెండి ధరలపై కనిపించింది. స్టాక్ మార్కెట్‌లో గందరగోళం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని(gold) ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
ఈ క్రమంలో ఈరోజు ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర దాదాపు రూ.500 పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.73,020కి పెరిగింది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.72,870కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,800కి చేరింది.
మరోవైపు ఈరోజు వెండి రేటు కూడా 500 రూపాయలు పెరిగింది. దీంతో నేడు ఢిల్లీ(delhi)లో కిలో వెండి రేటు రూ.94,000కు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 98500, ముంబైలో కిలో వెండి ధర రూ. 94,000, చైన్నైలో కిలో వెండి ధర రూ. 98500, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 94000, కేరళలో కిలో వెండి ధర రూ. 98,500కు చేరింది.
అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆధారంగా బంగారం ధర ప్రతిరోజూ నిర్ణయించబడుతుంది. అందుకు తగ్గట్టుగానే గత కొన్ని నెలలుగా బంగారం ధరల్లో మార్పు కనిపిస్తోంది. చైనా, రష్యా, సహా పలు దేశాలు డాలర్ల బదులు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం వల్ల బంగారం ధర పెరుగుతూ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బంగారం ధర పెరగడంతో మధ్యతరగతి, నగల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
Stock Market: ఎన్నికల ఫలితాల వేళ అప్రమత్తం.. సెన్సెక్స్ 3500 పాయింట్లు ఢమాల్!
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
For Latest News and Business News click here