Share News

Gold and Silver Rate: బంగారం, వెండి ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ. 2300 తగ్గుదల

ABN , Publish Date - Jun 06 , 2024 | 07:09 AM

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా నేడు(జూన్ 6న) బంగారం(gold) ధరలు 10 గ్రాములకు 220 రూపాయలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,740కి చేరుకుంది.

Gold and Silver Rate: బంగారం, వెండి ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ. 2300 తగ్గుదల
gold and silver rate updates june 6th 2024

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా నేడు(జూన్ 6న) ఉదయం 7 గంటల నాటికి బంగారం(gold) ధరలు 10 గ్రాములకు 220 రూపాయలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,740కి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,790గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.66,590గా ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 72640కి చేరింది. ఇక ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు 22 క్యారెట్)

  • హైదరాబాద్‌: రూ. 66,590

  • విజయవాడ: రూ. 66,590

  • ఢిల్లీ: రూ. 66,740

  • చెన్నై: రూ.67,240

  • ముంబై: రూ. 66,590

  • కోల్‌కతా: రూ. 66,590

  • బెంగళూరు: రూ. 66,590

వెండి ధర

మరోవైపు నేడు కేజీ వెండి(silver) ధర ఏకంగా రూ.2,300 తగ్గింది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 91,600, హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 96100, ముంబైలో కిలో వెండి ధర రూ. 91,600, చైన్నైలో కిలో వెండి ధర రూ. 96100, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 91,600, కేరళలో కిలో వెండి ధర రూ. 96100గా ఉంది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.


ఇది కూడా చదవండి:

మార్కెట్‌కు ‘చంద్ర’ కళ


CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

For Latest News and Business News click here

Updated Date - Jun 06 , 2024 | 07:11 AM