Gold and Silver Rate: భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే
ABN , Publish Date - Jun 07 , 2024 | 06:28 AM
దేశంలో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరలకు మళ్లీ బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్ల సానుకూల ధోరణితో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.700 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.770 పెరిగింది.
దేశంలో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరలకు మళ్లీ బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్ల సానుకూల ధోరణితో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.700 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.770 పెరిగింది. ఈ పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 67,460కి చేరగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.73,580కి చేరుకుంది.
ఈ నెలలో బంగారం గరిష్ట ధర ఇదే కావడం విశేషం. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,310 కాగా, 24 క్యారెట్ల బంగార ధర రూ. 73,430కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇతర నగరాల్లో బంగారం ధరలు (22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 67,460
హైదరాబాద్‌లో రూ. 67,310
విజయవాడలో రూ. 67,310
చెన్నైలో రూ. 68,010
బెంగళూరులో రూ. 67,310
అహ్మదాబాద్‌లో రూ. 67360
కేరళలో రూ. 67,310
కోల్‌కత్తాలో రూ. 67,310
వెండి ధర కూడా..
ఈ క్రమంలో దేశంలో వెండి ధర కూడా కిలోకు రూ.1800 పెరిగింది. ఈ పెంపుతో కిలో వెండి రూ.93,600కి చేరుకుంది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 93,600కు చేరుకోగా, హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 98,100కు చేరుకుంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 93,600, చైన్నైలో కిలో వెండి ధర రూ. 98,100, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 93,600, కేరళలో కిలో వెండి ధర రూ. 98,100, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 90,900గా ఉంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
For Latest News and Business News click here