Share News

Gold and Silver Rate: బంగారం, వెండి రేట్లు తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే

ABN , Publish Date - May 31 , 2024 | 06:28 AM

మీరు ఈరోజు బంగారం(gold) లేదా వెండి(silver) కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పైకి దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు నేడు (మే 31న) బ్రేక్ పడింది. 24 క్యారెట్ల బంగారం ధర 423 రూపాయలు తగ్గింది.

Gold and Silver Rate: బంగారం, వెండి రేట్లు తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే
gold and silver rate updates May 31sth 2024

మీరు ఈరోజు బంగారం(gold) లేదా వెండి(silver) కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పైకి దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు నేడు (మే 31న) బ్రేక్ పడింది. 24 క్యారెట్ల బంగారం ధర 423 రూపాయలు తగ్గింది. దీంతో ఈరోజు ఉదయం 6.25 గంటల నాటికి ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,840కి చేరగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.72,900కి చేరుకుంది.

మరోవైపు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,750గా ఉండగా, 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,690కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్ రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు)

  • హైదరాబాద్‌: రూ. 66,690

  • విజయవాడ: రూ. 66,690

  • ఢిల్లీ: రూ. 66,840

  • చెన్నై: రూ.67,290

  • ముంబై: రూ. 66,690

  • కోల్‌కతా: రూ. 66,690

  • బెంగళూరు: రూ. 66,690

  • అహ్మదాబాద్: రూ.66,740

వెండి ధరలు

అదే సమయంలో ఈరోజు మార్కెట్‌లో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో రూ.1400 తగ్గి రూ.96,400కి చేరింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ. 96,400, హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 1,00,900, ముంబైలో కిలో వెండి ధర రూ. 96,400, చైన్నైలో కిలో వెండి ధర రూ. 100900, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 96,400, కేరళలో కిలో వెండి ధర రూ. 1,00,900గా ఉంది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.


ఇది కూడా చదవండి:

Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


Read Latest Business News and Telugu News

Updated Date - May 31 , 2024 | 07:42 AM