Gold and Silver Rates Today: బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Aug 16 , 2024 | 06:24 AM
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మీరు గోల్డ్(gold) లేదా సిల్వర్(silver) కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే తిసేసుకోండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 16న) శుక్రవారం ఉదయం 6.25 నిమిషాల నాటికి 24, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 తగ్గింది.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మీరు గోల్డ్(gold) లేదా సిల్వర్(silver) కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే తిసేసుకోండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 16న) శుక్రవారం ఉదయం 6.25 నిమిషాల నాటికి 24, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 తగ్గింది. దీంతో ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 71,500గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ. 65,540కి చేరుకుంది.
పాత స్థాయికి
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,650కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,690గా ఉంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 71,500కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 65,540కి చేరింది. అయితే బడ్జెట్‌కు ముందు బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.75,000. అయితే బంగారంపై కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే బంగారం ధర పడిపోయి ఇప్పటి వరకు మాత్రం పాత స్థాయికి చేరుకోలేకపోయింది.
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)
హైదరాబాద్‌లో రూ. 71,500, రూ. 65,540
విజయవాడలో రూ. 71,500, రూ. 65,540
ఢిల్లీలో రూ. 71,650, రూ. 65,690
చెన్నైలో రూ. 71,500, రూ. 65,540
సూరత్‌లో రూ. 71,550, రూ. 65,590
ముంబైలో రూ. 71,500, రూ. 65,540
బెంగళూరులో రూ. 71,500, రూ. 65,540
కోల్‌కతాలో రూ. రూ. 71,500, రూ. 65,540
కేరళలో రూ. 71,500, రూ. 65,540
మరోవైపు దేశవ్యాప్తంగా వెండి రేట్లలో కూడా తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గి రూ. 83,600కు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 83,600
బెంగళూరులో రూ.79,900
విజయవాడలో రూ. 88,600
హైదరాబాద్‌లో రూ. 88,600
చెన్నైలో రూ. 88,600
గోవాలో రూ. 79,900
కేరళలో రూ. 88,600
ఇండోర్‌లో రూ. 83,600
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి తీసుకునే సమయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News