Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూశారా?
ABN , Publish Date - Feb 28 , 2024 | 07:36 AM
దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలలో(Gold and Silver Rates) స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే ఎంత రేటు పెరిగింది, ఎంత తగ్గిందనే వివరాలను ఇక్కడ చుద్దాం.
ఈరోజు (బుధవారం) బంగారం(Gold Rates), వెండి(Silver) ధరల్లో స్వల్పంగా మార్పు కనిపించింది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,590 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.62,830గా ఉంది. ఇది నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,600గా ఉంది. కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది. మరోవైపు దేశంలో వెండి(Silver) ధర ప్రస్తుతం కిలోకు 100 రూపాయలు తగ్గింది. ఈరోజు కేజీ వెండి ధర రూ.75,400 ఉండగా ఈ రేటు నిన్న 75,500గా ఉంది. అంతర్జాతీయ ధరల ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది. డాలర్‌తో రూపాయి మారకం కరెన్సీ మార్పులపై ఇవి ఆధారపడి ఉంటాయి.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,590. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,830
-విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,590. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,830
-ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,740. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,990
-చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,160. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.63,450
-ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,590. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,830
-కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,590. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,830
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వొడాఫోన్ ఐడియా రూ.45,000 కోట్ల సమీకరణ