Share News

Gold and Silver Rates Today: దీపావళి తర్వాత రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Nov 02 , 2024 | 06:30 AM

దీపావళి పండుగ తర్వాత బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న ఈ ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: దీపావళి తర్వాత రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
gold and silver rates today

దేశవ్యాప్తంగా దీపావళి పండుగ తర్వాత బంగారం(gold), వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీపావళి పండుగ నేపథ్యంలో భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న ఈ రేట్లు ప్రస్తుతం దిగజారాయి. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 2న) ఉదయం 6.25 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 790 తగ్గిపోయి రూ. 80,550 స్థాయికి చేరుకుంది.

ఈ క్రమంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,550కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73,840కి చేరింది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 80,700 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 73,990కి చేరింది. మరోవైపు ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇవి కిలోకు 3 వేల రూపాయలు పడిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు చుద్దాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • ఢిల్లీలో రూ. 80,700, రూ. 73,990

  • హైదరాబాద్‌లో రూ. 80,550, రూ. 73,840

  • విజయవాడలో రూ. 80,550, రూ. 73,840

  • ముంబైలో రూ. 80,550, రూ. 73,840

  • వడోదరలో రూ. 80,600, రూ. 73,890

  • కోల్‌కతాలో రూ. 80,550, రూ. 73,840

  • బెంగళూరులో రూ. 80,550, రూ. 73,840

  • కేరళలో రూ. 80,550, రూ. 73,840

  • పూణేలో రూ. 80,550, రూ. 73,840

  • చెన్నైలో రూ. 80,550, రూ. 73,840


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • హైదరాబాద్‌లో రూ. 105,900

  • విజయవాడలో రూ. 105,900

  • ఢిల్లీలో రూ. 96,900

  • చెన్నైలో రూ. 105,900

  • కోల్‌కతాలో రూ. 96,900

  • కేరళలో రూ. 105,900

  • ముంబైలో రూ. 96,900

  • బెంగళూరులో రూ. 96,900

  • భువనేశ్వర్‌లో రూ. 105,900

  • వడోదరలో రూ. 96,900

  • అహ్మదాబాద్‌లో రూ. 96,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 02 , 2024 | 06:34 AM