Gold and Silver Rates Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం రేట్లు, తగ్గిన వెండి
ABN , Publish Date - Aug 22 , 2024 | 06:27 AM
నిన్న స్వల్పంగా తగ్గిన పుత్తడి(gold) ధరలు ఈరోజు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.570 పెరిగి రూ. 73,360కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,260కు చేరింది.
పసిడి ప్రియులకు షాకింగ్ గ్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన పుత్తడి(gold) ధరలు ఈరోజు(ఆగస్టు 22న) మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.570 పెరిగి రూ. 73,360కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,260కు చేరింది.
ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,210కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,110కు చేరింది. మరోవైపు ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.200 తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేజీ వెండి(silver) ధర రూ.86,900కు చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 73,360, రూ. 67,260
విజయవాడలో రూ. 73,210, రూ. 67,110
హైదరాబాద్‌లో రూ. 73,210, రూ. 67,110
వడోదరలో రూ. 73,260, రూ. 67,160
ముంబైలో రూ. 73,210, రూ. 67,110
చెన్నైలో రూ. 73,210, రూ. 67,110
బెంగళూరులో రూ. 73,210, రూ. 67,110
కేరళలో రూ. 73,210, రూ. 67,110
కోల్‌కతాలో రూ. 73,210, రూ. 67,110
దేశంలోని కీలక నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)
హైదరాబాద్‌లో రూ. 91,900
ఢిల్లీలో రూ. 86,900
విజయవాడలో రూ. 91,900
కోల్‌కతాలో రూ. 86,900
ముంబైలో రూ. 86,900
బెంగళూరులో రూ. 84,900
కేరళలో రూ. 91,900
పూణెలో రూ. 86,900
చెన్నైలో రూ. 91,900
మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో కామెక్స్ బంగారం ఔన్స్‌కు 6.10 డాలర్లు తగ్గి 2,544.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాల మధ్య మంగళవారం ఆల్ టైమ్ కొత్త గరిష్ఠ స్థాయిని తాకి $2,500 పైన ట్రేడవుతోంది. US డాలర్ ఇండెక్స్ బలహీనత, చైనా నుంచి బలమైన డిమాండ్ మధ్య ఈ మెటల్ పై ఒత్తిడి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇంకోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో కామెక్స్ వెండి ఔన్స్‌కు 0.24 శాతం పెరిగి $ 30.03 స్థాయిలో ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని తీసుకునే సమయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..
Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..
Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం
Read More Business News and Latest Telugu News