Share News

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి అయితే..

ABN , Publish Date - Dec 07 , 2024 | 06:34 AM

దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. యూఎస్ డాలర్ బలపడటం సహా పలు అంశాల నేపథ్యంలో వీటి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అయితే నేడు ఏ మేరకు తగ్గాయి, ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి అయితే..
gold and silver rates today

దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన వీటి ధరలు, ఈరోజు మాత్రం తగ్గాయి. ఈ నేపథ్యంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయలు తగ్గగా, మరోవైపు కిలో వెండి రేటు కూడా 200 పడిపోయింది. మరికొన్ని రోజుల్లో ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని పలువురు చెబుతుండగా, మరికొంత మంది మాత్రం పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందని అంచనా వేస్తున్నారు.


నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ క్రమంలో నేడు (డిసెంబర్ 7న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,610 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,140కు చేరింది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 760కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71,290కి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • చెన్నైలో రూ. 77,610, రూ. 71,140

  • ముంబైలో రూ. 77,610, రూ. 71,140

  • ఢిల్లీలో రూ. 77, 760, రూ. 71,290

  • హైదరాబాద్‌లో రూ. 77,610, రూ. 71,140

  • విజయవాడలో రూ. 77,610, రూ. 71,140

  • వడోదరలో రూ. 77,660, రూ. 71,190

  • బెంగళూరులో రూ. 77,610, రూ. 71,140

  • కోల్‌కతాలో రూ. 77,610, రూ. 71,140

  • పూణేలో రూ. 77,610, రూ. 71,140

  • కేరళలో రూ. 77,610, రూ. 71,140


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 91,900

  • సూరత్‌లో రూ. 91,900

  • ముంబైలో రూ. 91,900

  • తిరుపతిలో రూ. 100,900

  • హైదరాబాద్‌లో రూ. 100,900

  • విజయవాడలో రూ. 100,900

  • కేరళలో రూ. 100,900

  • వడోదరలో రూ. 91,900

  • పాట్నాలో రూ. 91,900

  • అహ్మదాబాద్‌లో రూ. 91,900

  • చెన్నైలో రూ. 100,900

  • కోల్‌కతాలో రూ. 91,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 07 , 2024 | 08:54 AM