Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Dec 08 , 2024 | 06:26 AM
పసిడి ప్రియులకు షాకింగ్. తగ్గుతాయని భావించిన పసిడి రేట్లు క్రమంగా పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో పుత్తడి ధరలు మళ్లీ 78 వేల స్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ఏదైనా ఫంక్షన్ లేదా పండుగల కోసం బంగారం(gold), వెండిని కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మార్కెట్‌కి వెళ్లే ముందు ఒక్కసారి వీటి ధరల గురించి తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కానీ ఈరోజు(ఆదివారం) ఉదయం బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. కొత్త రేట్ల ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా 10 గ్రాములకు 10 రూపాయలు మాత్రమే పెరిగి రూ.77,620కి చేరుకుంది. మరోవైపు వెండి రేటు కూడా కిలోకు 100 రూపాయలు పెరిగింది.
ఈరోజు ధరలు ఎంతకు చేరాయంటే..
నేడు (డిసెంబర్ 8న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,620కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,150కు చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 770కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71,300కి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ఢిల్లీలో రూ. 77, 770, రూ. 71,300
చెన్నైలో రూ. 77,620, రూ. 71,150
ముంబైలో రూ. 77,620, రూ. 71,150
వడోదరలో రూ. 77,670, రూ. 71,200
కేరళలో రూ. 77,620, రూ. 71,150
హైదరాబాద్‌లో రూ. 77,620, రూ. 71,150
విజయవాడలో రూ. 77,620, రూ. 71,150
బెంగళూరులో రూ. 77,620, రూ. 71,150
కోల్‌కతాలో రూ. 77,620, రూ. 71,150
పూణేలో రూ. 77,620, రూ. 71,150
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 92,000
సూరత్‌లో రూ. 92,000
ముంబైలో రూ. 92,000
తిరుపతిలో రూ. 100000
హైదరాబాద్‌లో రూ. 100000
విజయవాడలో రూ. 100000
కేరళలో రూ. 100000
వడోదరలో రూ. 92,000
పాట్నాలో రూ. 92,000
అహ్మదాబాద్‌లో రూ. 92,000
చెన్నైలో రూ. 100000
కోల్‌కతాలో రూ. 92,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Read More Business News and Latest Telugu News