Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Nov 15 , 2024 | 06:44 AM
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరల్లో మళ్లీ నాలుగోరోజు భారీగా తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం వెయ్యికిపైగా తగ్గగా, వెండి ధరలు కూడా దిగజారాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం(gold), వెండి (silver) ప్రియులకు గుడ్ న్యూ్స్ వచ్చేసింది. ఈ సమయంలో మీరు బంగారం లేదా వెండి కొనాలని చేయాలని చూస్తున్నట్లైతే వెంటనే వీటి ధరల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు ఉదయం నాటికి, నిన్నటితో పోల్చుకుంటే వీటి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏకంగా 1200 రూపాయలు తగ్గగా, వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు తగ్గడం విశేషం. మరోవైపు వెండి కూడా కిలోకు 1500 రూపాయలు తగ్గింది.
నేటి ధరలు ఇలా
నేడు దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 6.35 గంటల నాటికి 24 క్యారెట్ల 10 బంగారం గ్రాముల ధర రూ. 75,790కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.69,490కి చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,640కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 69,340కి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
హైదరాబాద్‌లో రూ. 75,640, రూ. 69,340
ఢిల్లీలో రూ. 75,790, రూ. 69,490
విజయవాడలో రూ. 75,640, రూ. 69,340
వడోదరలో రూ. 75,690, రూ. 69,390
చెన్నైలో రూ. 75,640, రూ. 69,340
కేరళలో రూ. 75,640, రూ. 69,340
ముంబైలో రూ. 75,640, రూ. 69,340
పూణేలో రూ. 75,640, రూ. 69,340
బెంగళూరులో రూ. 75,640, రూ. 69,340
కోల్‌కతాలో రూ. 75,640, రూ. 69,340
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
హైదరాబాద్‌లో రూ. 98,900
విజయవాడలో రూ. 98,900
ఢిల్లీలో రూ. 89,400
చెన్నైలో రూ. 98,900
కేరళలో రూ. 98,900
ముంబైలో రూ. 89,400
కోల్‌కతాలో రూ. 89,400
అహ్మదాబాద్‌లో రూ. 89,400
వడోదరలో రూ. 89,400
పాట్నాలో రూ. 89,400
సూరత్‌లో రూ. 89.400
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...
Jobs: గుడ్‌న్యూస్ త్వరలో 3.39 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగంలో ఉంటాయంటే.
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Read More International News and Latest Telugu News