Share News

Gold and Silver Rates Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Nov 08 , 2024 | 06:31 AM

మీరు ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏ మేరకు తగ్గాయి. ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Gold and Silver Rates Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
gold and silver rates today

దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైన నేపథ్యంలో బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు గత కొన్ని రోజులుగా 80 వేలకుపైగా ఉన్న పసిడి ధరలు అమాంతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 8న ) ఉదయం 6.27 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1,810 తగ్గి రూ. 78,550కి చేరుకుంది.

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 71,990కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 78,700కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.72,140కి స్థాయికి చేరింది. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం కిలోకు ఏకంగా 3 వేల రూపాయలు తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • విజయవాడలో రూ. 78,550, రూ. 71,990

  • హైదరాబాద్‌లో రూ. 78,550, రూ. 71,990

  • ఢిల్లీలో రూ. 78,700, రూ. 72,140

  • ముంబైలో రూ. 78,550, రూ. 71,990

  • వడోదరలో రూ. 78,600, రూ. 72,040

  • చెన్నైలో రూ. 78,550, రూ. 71,990

  • బెంగళూరులో రూ. 78,550, రూ. 71,990

  • పూణేలో రూ. 78,550, రూ. 71,990

  • కేరళలో రూ. 78,550, రూ. 71,990

  • కోల్‌కతాలో రూ. 78,550, రూ. 71,990


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • హైదరాబాద్‌లో రూ. 101,900

  • విజయవాడలో రూ. 101,900

  • ఢిల్లీలో రూ. 92900

  • చెన్నైలో రూ. 101,900

  • కోల్‌కతాలో రూ. 92900

  • పూణేలో రూ. 92,900

  • కేరళలో రూ. 101,900

  • వడోదరలో రూ. 92,900

  • ముంబైలో రూ. 92,900

  • బెంగళూరులో రూ. 92,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 08 , 2024 | 06:40 AM