Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:28 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే నిన్న భారీగా తగ్గిన ఈ ధరలు నేడు మాత్రం పుంజుకున్నాయి. అయితే ఇవి ఏ మేరకు తగ్గాయి. ఏ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ సంస్కృతిలో బంగారానికి(gold) ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని కొంత మంది పెట్టుబడిగా ఉపయోగిస్తే, మరికొంత మంది మాత్రం సంప్రదాయ పండుగలు, వివాహాల సమయంలో కొనుగోళ్లు చేస్తుంటారు. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతుంటాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు మాత్రం ధరలు పుంజుకున్నాయి.
ఈ క్రమంలో నేడు (నవంబర్ 9న ) ఉదయం 6.28 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 930 పెరిగి రూ. 79,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72,860కి చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 79,630కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 73,010 స్థాయి వద్ద ఉంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా కిలోకు 1200 రూపాయలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
ఢిల్లీలో రూ. 79,630, రూ. 73,010
హైదరాబాద్‌లో రూ. 79,480, రూ. 72,860
విజయవాడలో రూ. 79,480, రూ. 72,860
చెన్నైలో రూ. 79,480, రూ. 72,860
ముంబైలో రూ. 79,480, రూ. 72,860
వడోదరలో రూ. 79,530, రూ. 72,910
బెంగళూరులో రూ. 79,480, రూ. 72,860
కోల్‌కతాలో రూ. 79,480, రూ. 72,860
పూణేలో రూ. 79,480, రూ. 72,860
కేరళలో రూ. 79,480, రూ. 72,860
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 94,100
విజయవాడలో రూ. 103,100
హైదరాబాద్‌లో రూ. 103,100
చెన్నైలో రూ. 103,100
కోల్‌కతాలో రూ. 94,100
పూణేలో రూ. 94,100
కేరళలో రూ. 103,100
వడోదరలో రూ. 94,100
ముంబైలో రూ. 94,100
బెంగళూరులో రూ. 94,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..
Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..
Stock Markets: పెట్టుబడిదారులకు షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ ఎంత నష్టపోయాయంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News