Gold and Silver Rates Today: దసరా తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 13 , 2024 | 06:24 AM
దసరా పండుగ ముందు తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా పంజుకుంటున్నాయి. మళ్లీ 77 వేల స్థాయి దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా దసరా పండుగ పూర్తైంది. ఇక దీపావళి పండుగ తర్వాత మళ్లీ పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, ఈరోజు కూడా బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో నేడు (అక్టోబర్ 13న) ఉదయం 6.10 నిమిషాల నాటికి దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 40 పెరిగి రూ. 76,430కి చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 70,061కు చేరింది.
రాజధానిలో
దీంతో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,160కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 69,813కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 76,420కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 70,052 స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర కిలోకు స్వల్పంగా 10 రూపాయలు మాత్రమే పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
బెంగళూరులో రూ. 76,350, రూ. 69,988
హైదరాబాద్‌లో రూ. 76,420, రూ. 70,052
విజయవాడలో రూ. 76,420, రూ. 70,052
ఢిల్లీలో రూ. 76,160, రూ. 69,813
కోల్‌కతాలో రూ. 76,190, రూ. 69,841
ముంబైలో రూ. 76,290, రూ. 69,933
చెన్నైలో రూ. 76,520, రూ. 70,143
లక్నోలో రూ. 76,310, రూ. 69,951
వడోదరలో రూ. 76,400, రూ. 70,033
కోటాలో రూ. 76,280, రూ. 69,923
ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)
ఢిల్లీలో రూ. 91,540
హైదరాబాద్‌లో రూ. 91,840
విజయవాడలో రూ. 91,840
ముంబైలో రూ. 91,690
కోల్‌కతాలో రూ. 91,570
చెన్నైలో రూ. 91,960
బెంగళూరులో రూ. 91,770
లక్నోలో రూ. 91,720
కోటాలో రూ. 91,680
వడోదరలో రూ. 91,820
పూణేలో రూ. 91,700
జైపూర్‌లో రూ. 91,680
శ్రీనగర్‌లో రూ. 91,850
సూరత్‌లో రూ. 91,820
గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. వీటిలో జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు కలిసి ఉండవు. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Business News and Latest Telugu News