Gold and Silver Rates Updates: పసిడి ప్రియులకు షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు
ABN , Publish Date - Sep 10 , 2024 | 06:29 AM
బంగారం, వెండి రేట్లు నిన్న తగ్గాయని అనుకున్న క్రమంలోనే మళ్లీ ఈరోజు ధరలు పుంజుకున్నాయి. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 10న) ఉదయం 6.27 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం(gold) ధర 10 గ్రాములకు రూ.300 పెరిగింది. మరోవైపు కిలో వెండి ధర కూడా భారీగా పెరిగింది.
బంగారం(gold), వెండి(silver) ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్. రేట్లు నిన్న తగ్గాయని అనుకున్న క్రమంలోనే ఈరోజు మళ్లీ ధరలు పైపైకి చేరాయి. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 10న) ఉదయం 6.27 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం(gold) ధర 10 గ్రాములకు రూ.300 పెరిగింది. దీంతో నేడు విజయవాడ, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,310కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,200గా చేరింది.
మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73,460కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67,350 స్థాయికి చేరుకుంది. ఇంకోవైపు వెండి రేటు మాత్రం కేజీకి 700 రూపాయలు పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో కీలక నగరాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 73,460, రూ. 67,350
హైదరాబాద్‌లో రూ. 73,310, రూ. 67,200
విజయవాడలో రూ. 73,310, రూ. 67,200
బెంగళూరులో రూ. 73,360, రూ. 67,250
ముంబైలో రూ. 73,310, రూ. 67,200
చెన్నైలో రూ. 73,310, రూ. 67,200
కోల్‌కతాలో రూ. 73,310, రూ. 67,200
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో వెండి రేట్లు (కిలోకు)
ఢిల్లీలో రూ. 85,100
హైదరాబాద్‌లో రూ. 90,100
విజయవాడలో రూ. 90,100
కోల్‌కతాలో రూ. 85,100
ముంబైలో రూ. 85,100
బెంగళూరులో రూ. 83,400
కేరళలో రూ. 90,100
చెన్నైలో రూ. 90,100
పూణేలో రూ. 85,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలను కలిగి ఉండవు.
ఇవి కూడా చదవండి:
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
Read MoreBusiness News and Latest Telugu News