మరో 18 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:02 AM
దేశంలోని మరో 18 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్,బిహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా...
న్యూఢిల్లీ: దేశంలోని మరో 18 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్,బిహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు చెందిన 18 జిల్లాల్లో ఈ నెల 5 నుంచే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.