Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు
ABN , Publish Date - May 15 , 2024 | 08:04 AM
బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో అందంగా ముస్తాబవ్వాలని వాళ్లు కోరుకుంటారు. కానీ..
బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో అందంగా ముస్తాబవ్వాలని వాళ్లు కోరుకుంటారు. కానీ.. మార్కెట్‌లో చూస్తే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకి సరికొత్త గరిష్టాల్ని తాకుతూ చుక్కలు చూపిస్తున్నాయి. కానీ.. మే 15న (బుధవారం) మాత్రం బంగారం ప్రియులకు కాస్త ఊరటనిస్తూ, బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని పలు అంశాల ప్రభావం కారణంగా.. ఈ ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,810లకు చేరింది.
ప్రధాన నగరాల్లో ఈ బంగారం ధరలు (10 గ్రాములు) ఎలా ఉన్నాయంటే..
* చెన్నై: 22 క్యారెట్ - రూ.66,890, 24 క్యారెట్ - రూ.72,970
* ముంబై: 22 క్యారెట్ - రూ.66,740, 24 క్యారెట్ - రూ.72,810
* హైదరాబాద్: 22 క్యారెట్ - రూ.66,740, 24 క్యారెట్ - రూ.72,810
* ముంబై: 22 క్యారెట్ - రూ.66,740, 24 క్యారెట్ - రూ.72,810
* ఢిల్లీ: 22 క్యారెట్ - రూ.66,890, 24 క్యారెట్ - రూ.72,960
* బెంగళూరు: 22 క్యారెట్ - రూ.66,740, 24 క్యారెట్ - రూ.72,810
ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు.. చెల్లెమ్మా అంటూ దగ్గరయ్యారు.. చివరికి?
మరోవైపు.. బుధవారం నాడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.87,300 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలను మీరు మిస్డ్ కాల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. కాసేపట్లోనే కూడా ఎస్ఎంఎస్ వస్తుంది. అలాగే.. ibjarates.com అనే వెబ్‌సైట్‌ని సందర్శించి కూడా మీరు ఉదయం, సాయంత్రం గోల్డ్ రేట్ అప్‌డేట్స్‌ని తెలుసుకోవచ్చు. కాగా.. ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి.
Read Latest Business News and Telugu News