Share News

Gold and Silver Rates: బంగారు ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

ABN , Publish Date - Sep 12 , 2024 | 07:28 AM

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే సెప్టెంబర్ 11 బుధవారం ధరతో పోలిస్తే గురువారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు..

Gold and Silver Rates: బంగారు ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
Gold and Silver Rates

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర తగ్గితే వెంటనే కొనుగోలు చేస్తుంటారు. మరి ఈరోజు (12 ఆగష్టు 2024) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.


బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే సెప్టెంబర్ 11 బుధవారం ధరతో పోలిస్తే గురువారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు ఒక రూపాయి ధర పెరిగింది. గ్రాము బంగారం ధర రూ.6,716గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,326గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.73,260గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.


వివిధ నగరాల్లో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి బుధవారంతో పోలిస్తే గురువారం గ్రాముకు రూపాయి పెరిగింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,731గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.67,310గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.7,341గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.73,410గా ఉంది.


దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.6,715గా ఉంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,326గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.73,260గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 6,716గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాము ధర రూ.7,326కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.73,260గా ఉంది.


దేశంలో వెండి ధరలు

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు చూస్తే.. బుధవారంతో పోలిస్తే గురువారం స్వల్పంగా ధర పెరిగింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.91,600గా ఉంది.


Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి ఉండొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 12 , 2024 | 07:28 AM