Share News

Gold Prices Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్

ABN , Publish Date - Jun 25 , 2024 | 07:20 AM

రోజులు గడుస్తున్న కొద్దీ బంగారం విలువ అమాంతం పెరిగిపోతోంది. డాలర్‌ విలువ కొంతమేర తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పుంజుంకుంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,344 డాలర్ల వద్ద ఉంది.

Gold Prices Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్

ఇంటర్నెట్ డెస్క్: రోజులు గడుస్తున్న కొద్దీ బంగారం విలువ అమాంతం పెరిగిపోతోంది. డాలర్‌ విలువ కొంతమేర తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పుంజుంకుంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,344 డాలర్ల వద్ద ఉంది. భారత్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర(Gold Prices Today) గడిచిన రెండు రోజుల్లో రూ.1000 తగ్గింది.

మంగళవారం తులం బంగారం ధర ‍‌(24 క్యారెట్ల)150 రూపాయలు, తులం ఆర్నమెంట్ బంగారం ధర ‍‌(22 క్యారెట్ల)100 రూపాయలు తగ్గింది. కిలో వెండి రేటు రూ.300 మేర దొగొచ్చింది.


తెలుగు రాష్ట్రాలో ధరలివి..

హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72 వేల 230 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.66 వేల 250గా ఉంది.హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.96 వేల 200 గా ఉంది.

ఏపీ, తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే ధర ఉంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72 వేల 230, 22 క్యారెట్ల బంగారం ధర రూ.66 వేల 250గా ఉంది. కిలో వెండి ధర రూ.96 వేల 200 గా ఉండగా.. విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి.

For Latest News and National News click here

Updated Date - Jun 25 , 2024 | 07:20 AM