Gold And Silver Price: పండగ వేళ.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్
ABN , Publish Date - Oct 29 , 2024 | 08:58 AM
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,140గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.460 తగ్గింది. విజయవాడ, విశాఖపట్టణంలో హైదరాబాద్ మాదిరిగా ధరలు ఉన్నాయి.
హైదరాబాద్: దీపావళి పండగ దగ్గరికి వస్తోన్న నేపథ్యంలో మహిళలకు బులియన్ మార్కెట్ గుడ్‌న్యూస్ చెబుతోంది. బంగారం ధరలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి. పండగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పదండి.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,140గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.460 తగ్గింది. విజయవాడ, విశాఖపట్టణంలో హైదరాబాద్ మాదిరిగా ధరలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మేలిమి బంగారం ధర రూ.79,790 ఉంది. నిన్నటితో పోల్చితే రూ.500 వరకు తగ్గింది.
ఢిల్లీలో ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,290 ఉంది. ముంబై, కోల్ కతా, బెంగళూర్, చెన్నైలో ఓకేలా ధర ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,140గా ఉంది. ఢిల్లీలో మేలిమి బంగారం ధర రూ.79,940 ఉండగా, ముంబై, కోల్ కతా, బెంగళూర్, చెన్నైలో రూ.79,790గా ఉంది. వెండి ధర మంగళవారం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,06,900గా ఉంది. ముంబై, ఢిల్లీలో 97,900గా ఉంది. బెంగళూరులో రూ.96,900గా ఉంది.