Share News

Gold and Silver Rates Today: పండుగ ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Oct 20 , 2024 | 06:27 AM

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. తగ్గుతాయని భావించిన పసిడి రేట్లు పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో పుత్తడి ధరలు 79 వేల స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: పండుగ ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
gold rates today october 20th 2024

భారతదేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతాయని భావించిన వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఈ ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దీపావళి పండుగకు ముందే ఈ రేట్లు పైపైకి చేరుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల హీట్ సహా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే పుత్తడి ధరలు 80 వేల దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 430 పెరుగగా, మరోవైపు వెండి కూడా వెయ్యికిపైగా పుంజుకుంది.


కొన్ని రోజులుగా

దీంతో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,420కి చేరుకోగా. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 72,800కి చేరుకుంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 79,570కి చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.72,930కి చేరింది. గత కొన్ని రోజులుగా కూడా బంగారం ధరల్లో ర్యాలీ కనిపించడం విశేషం. భవిష్యత్తులో ఈ రేట్లు మరింత పెరుగాతాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • ఢిల్లీలో రూ. 79,570, రూ. 72,930

  • విజయవాడలో రూ. 79,420, రూ. 72,800

  • హైదరాబాద్‌లో రూ. 79,420, రూ. 72,800

  • చెన్నైలో రూ. 79,420, రూ. 72,800

  • వడోదరలో రూ. 79,470, రూ. 72,830

  • ముంబైలో రూ. 79,420, రూ. 72,800

  • బెంగళూరులో రూ. 79,420, రూ. 72,800

  • కోల్‌కతాలో రూ. 79,420, రూ. 72,800

  • కేరళలో రూ. 79,420, రూ. 72,800

  • పూణేలో రూ. 79,420, రూ. 72,800


ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)

  • హైదరాబాద్‌లో రూ. 1,07,000

  • విజయవాడలో రూ. 1,07,000

  • ఢిల్లీలో రూ. 99,500

  • చెన్నైలో రూ. 1,07,000

  • కేరళలో రూ. 1,07,000

  • ముంబైలో రూ. 99,500

  • కోల్‌కతాలో రూ. 99,500

  • అహ్మదాబాద్‌లో రూ. 99,500

  • వడోదరలో రూ. 99,500

  • బెంగళూరులో రూ. 97000

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా చెక్ చేసుకోండి..


Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..


Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..


Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 20 , 2024 | 06:35 AM