Gold and Silver Rates Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 06:25 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఈ ధరలు ఏ మేరకు తగ్గాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం(gold), వెండి(silver) ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్ పడింది. ఇటివల పసిడి రేట్లు రూ. 80 వేల స్థాయికి చేరుకోగా, ఇప్పుడు దీపావళి పండుగకు ముందే ఈ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 25న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 620 తగ్గి రూ. 79,460కి చేరుకుంది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 72,840కి చేరింది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 79,610కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.72,990కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా కిలోకు వెయ్యింకిపైగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు చుద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
ఢిల్లీలో రూ. 79,610, రూ. 72,990
విజయవాడలో రూ. 79,460, రూ. 72,840
హైదరాబాద్లో రూ. 79,460, రూ. 72,840
వడోదరలో రూ. 79,510, రూ. 72,890
ముంబైలో రూ. 79,460, రూ. 72,840
బెంగళూరులో రూ. 79,460, రూ. 72,840
కోల్కతాలో రూ. 79,460, రూ. 72,840
చెన్నైలో రూ. 79,460, రూ. 72,840
కేరళలో రూ. 79,460, రూ. 72,840
పూణేలో రూ. 79,460, రూ. 72,840
ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)
ఢిల్లీలో రూ. 101,900
హైదరాబాద్లో రూ. 109,900
విజయవాడలో రూ. 109,900
చెన్నైలో రూ. 109,900
కేరళలో రూ. 109,900
ముంబైలో రూ. 101,900
కోల్కతాలో రూ. 101,900
అహ్మదాబాద్లో రూ. 101,900
వడోదరలో రూ. 101,900
బెంగళూరులో రూ. 101,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..
Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..
Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News