Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
ABN , Publish Date - Sep 29 , 2024 | 06:30 AM
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్న ట్రెండ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించింది. ఈ నేపథ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయి. ఏ నగరంలో ఎంత రేట్లు ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత ఇటివల బంగారం(gold) ధరలు ఆల్‍టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. నిరంతరం పెరుగుతున్న ట్రెండ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించింది. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 29న) ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.77,400కి చేరుకుంది.
అదే స్వచ్ఛత కలిగిన 100 గ్రాముల గోల్డ్ రూ.500 తగ్గి రూ.7,74,000కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.50 తగ్గి రూ.70,950 స్థాయికి చేరింది. మరోవైపు వెండి రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి(silver) ధర రూ.1,000 తగ్గి రూ.95,000కి చేరుకోగా, 100 గ్రాముల వెండి ధర రూ.100 తగ్గి రూ.9,500కి చేరింది.
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 77,400, రూ. 70,950
విజయవాడలో రూ. 77,400, రూ. 70,950
ఢిల్లీలో రూ. 77,550, రూ. 71,100
ముంబైలో రూ. 77,400, రూ. 70,950
పాట్నాలో రూ. 77,450, రూ. 71,000
వడోదరలో రూ. 77,450, రూ. 71,000
బెంగళూరులో రూ. 77,400, రూ. 70,950
పూణేలో రూ. 77,400, రూ. 70,950
కోల్‌కతాలో రూ. 77,400, రూ. 70,950
కేరళలో రూ. 77,400, రూ. 70,950
చెన్నైలో రూ. 77,400, రూ. 70,950
ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)
ఢిల్లీలో రూ. 95000
విజయవాడలో రూ. 101,000
హైదరాబాద్‌లో రూ. 101,000
చెన్నైలో రూ. 101,000
కేరళలో రూ. 95000
కోల్‌కతాలో రూ. 95000
భువనేశ్వర్‌లో రూ. 101,000
ముంబైలో రూ. 95000
అహ్మదాబాద్‌లో రూ. 95000
వడోదరలో రూ. 95000
బెంగళూరులో రూ. 85000
స్వచ్ఛతకు చిహ్నం
అన్ని బంగారు నాణేలు, కడ్డీలు లేదా ఆభరణాలు వాటి స్వచ్ఛత విషయంలో హాల్‌మార్క్ గుర్తు ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే ఎల్లప్పుడూ కొనుగోలు చేయాలి. గోల్డ్ క్వాలిటీని బట్టి క్యారెట్ల హాల్‌మార్క్ సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్ల బంగారంపై 958, 22 క్యారెట్‌లపై 916, 21 క్యారెట్‌పై 875, 18పై 750, 14 క్యారెట్‌పై 583 అని ఉంటాయి.
గమనిక: ఈ బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరల గురించి తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Utility News: మీ స్మార్ట్‌ఫోన్ స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ చేస్తే నిమిషాల్లోనే సూపర్‌ఫాస్ట్..
Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Read More National News and Latest Telugu News