Share News

Gold Rates Today: సామాన్యులకు పసిడి రేట్ల షాకింగ్.. ఇప్పుడే ఇలా అయితే, మరి పెళ్లిళ్ల సీజన్ నాటికి..

ABN , Publish Date - Oct 18 , 2024 | 05:33 PM

మీరు బంగారం, వెండి కొనాలని చుస్తున్నారా. అయితే ఓసారి రేట్లను చూసి నిర్ణయించుకోండి. ఎందుకంటే దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పైపైకి వెళ్తున్నాయి. ఉదయం ఉన్న రేట్లు, ఇప్పుడు సాయంత్రానికి మళ్లీ మారిపోయాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Gold Rates Today: సామాన్యులకు పసిడి రేట్ల షాకింగ్.. ఇప్పుడే ఇలా అయితే, మరి పెళ్లిళ్ల సీజన్ నాటికి..
gold silver prices today

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పసిడి(gold) ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ఇంకా మొదలు కాకముందే ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా పెరిగిన బంగారం ధరలు 78 వేల స్థాయికి చేరాయి. అంతేకాదు మరికొన్ని రోజుల్లో 80 వేల స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దీపావళి పండుగకు ముందే ధరలు ఇలా ఉంటే, పండుగ తర్వాత ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్‌లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయని భావించిన పలువురు కస్టమర్లు షాపులకు వెళ్లి బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ధరలు తగ్గితే కొనుగోళ్లు చేయాలని మరికొంత మంది భావిస్తున్నారు.


వెండి కూడా..

ఈ నేపథ్యంలో బంగారం షాపులు కస్టమర్లతో బిజిబిజీగా మారిపోయాయి. ఇక ఇండియా బులియన్ మార్కెట్ ప్రకారం అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 510 పెరిగి రూ. 77,760కి చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,280 స్థాయికి చేరింది. ఈ క్రమంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,710కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 71,234గా ఉంది. మరోవైపు వెండి(silver) ధరలు కూడా కిలోకు 1180 రూపాయలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • ఢిల్లీలో రూ. 77,450, రూ. 70,996

  • ముంబైలో రూ. 77,580, రూ. 71,115

  • కోల్‌కతాలో రూ. 77,480, రూ. 71,023

  • హైదరాబాద్‌లో రూ. 77,710, రూ. 71,234

  • విజయవాడలో రూ. 77,710, రూ. 71,234

  • బెంగళూరులో రూ. 77,640, రూ. 71,170

  • వడోదరలో రూ. 77,680, రూ. 71,207

  • చెన్నైలో రూ. 77,810, రూ. 71,326

  • కేరళలో రూ. 77,820, రూ. 71,335


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు ఎలా)

  • ఢిల్లీలో రూ. 92,790

  • ముంబైలో రూ. 93,020

  • కోల్‌కతాలో రూ. 92,890

  • హైదరాబాద్‌లో రూ. 93,160

  • విజయవాడలో రూ. 93,160

  • బెంగళూరులో రూ. 93,090

  • వడోదరలో రూ. 93,140

  • చెన్నైలో రూ. రూ. 93,290

  • కేరళలో రూ. 93,300

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు


Stock Market: వారాంతంలో స్టాక్ మార్కెట్లో లాభాల జోష్.. కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల లాభం..

Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..


Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..

Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 18 , 2024 | 05:38 PM