Gold and Silver Rates Today: బంగారం రేటు మళ్లీ తగ్గిందోచ్.. కానీ వెండి మాత్రం
ABN , Publish Date - Dec 05 , 2024 | 06:30 AM
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న బలహీన పోకడల నేపథ్యంలో గురువారం ఉదయం 6.22 నిమిషాల నాటికి నాటికి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (gold) ధర రూ. 20 రూపాయలు తగ్గింది. ఈ విధంగా 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర వరుసగా మూడో రోజు పతనం కావడం విశేషం. క్రితం సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 78,000 స్థాయిలో ముగిసింది. కానీ ఈరోజు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలోకు రూ. 90,900 రూపాయలుగా ఉంది.
ఈరోజు బంగారం, వెండి ధరలు
ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 20 రూపాయలు తగ్గి రూ. 77,770కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,290కు చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 920కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71,440 స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇప్పుడు చుద్దాం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ఢిల్లీలో రూ.77, 920, రూ. 71,440
చెన్నైలో రూ. 77,770, రూ. 71,290
వడోదరలో రూ. 77,820, రూ. 71,340
ముంబైలో రూ. 77,770, రూ. 71,290
విజయవాడలో రూ. 77,770, రూ. 71,290
హైదరాబాద్‌లో రూ. 77,770, రూ. 71,290
కేరళలో రూ. 77,770, రూ. 71,290
బెంగళూరులో రూ. 77,770, రూ. 71,290
కోల్‌కతాలో రూ. 77,770, రూ. 71,290
పూణేలో రూ. 77,770, రూ. 71,290
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
హైదరాబాద్‌లో రూ. 99,400
వడోదరలో రూ. 90,900
విజయవాడలో రూ. 99,400
ఢిల్లీలో రూ. 90,900
ముంబైలో రూ. 90,900
సూరత్‌లో రూ. 90,900
అయోధ్యలో రూ. 90,900
పాట్నాలో రూ. 99,400
చెన్నైలో రూ. 99,400
అహ్మదాబాద్‌లో రూ. 90,900
కేరళలో రూ. 99,400
కోల్‌కతాలో రూ. 90,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News