Share News

Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..

ABN , Publish Date - Dec 06 , 2024 | 06:30 AM

దేశంలో గత మూడు రోజులుగా తగ్గిన బంగారం, వెండి రేట్లకు కళ్లెం పడింది. ఈ క్రమంలో నేడు ఉదయం నాటికి 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం, వెండి రేట్లు మళ్లీ పుంజుకున్నాయి. అయితే రేట్లు ఏ మేరకు తగ్గాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
gold silver rates december 6th

దేశీయంగా గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. నగల వ్యాపారులు, స్టాకిస్టుల తాజా కొనుగోళ్ల కారణంగా బులియన్ మార్కెట్‌లో బంగారం (gold) ధర మళ్లీ పెరిగింది. మూడు రోజుల క్షీణత తర్వాత శుక్రవారం ఉదయం నాటికి 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 130 పెరిగి రూ.77,900 స్థాయికి చేరుకుంది. మరోవైపు వెండి ధర కిలోకు ఏకంగా 1200 రూపాయలు పెరగడం విశేషం. ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా Comex (కమోడిటీ మార్కెట్) బంగారం ఫ్యూచర్స్ $ 7.20 లేదా 0.27 శాతం పడిపోయి, ఔన్స్ 2,669 డాలర్ల స్థాయికి చేరుకుంది.


ఈ క్రమంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,900కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,410కు చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78, 050కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71,560కి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. అయితే స్థానిక మార్కెట్లలో నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి తాజా డిమాండ్ కారణంగానే బంగారం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.


దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • కోల్‌కతాలో రూ. 77,900, రూ. 71,410

  • విజయవాడలో రూ. 77,900, రూ. 71,410

  • హైదరాబాద్‌లో రూ. 77,900, రూ. 71,410

  • ఢిల్లీలో రూ. 78, 050, రూ. 71,560

  • చెన్నైలో రూ. 77,900, రూ. 71,410

  • వడోదరలో రూ. 77,950, రూ. 71,460

  • ముంబైలో రూ. 77,900, రూ. 71,410

  • పూణేలో రూ. 77,900, రూ. 71,410

  • కేరళలో రూ. 77,900, రూ. 71,410

  • బెంగళూరులో రూ. 77,900, రూ. 71,410


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 92,100

  • ముంబైలో రూ. 92,100

  • హైదరాబాద్‌లో రూ. 101,100

  • వడోదరలో రూ. 92,100

  • విజయవాడలో రూ. 101,100

  • సూరత్‌లో రూ. 92,100

  • అయోధ్యలో రూ. 92,100

  • పాట్నాలో రూ. 92,100

  • చెన్నైలో రూ. 101,100

  • కోల్‌కతాలో రూ. 92,100

  • అహ్మదాబాద్‌లో రూ. 92,100

  • కేరళలో రూ. 101,100

    గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన


ఇవి కూడా చదవండి:

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 06 , 2024 | 06:48 AM