Gold and Silver Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Nov 28 , 2024 | 06:32 AM
దేశంలో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు ఉదయం నాటికి పసడి, వెండి రేట్లు పైపైకి చేరుకున్నాయి. అయితే ఏ నగరంలో ధరలు ఎంత పెరిగాయనే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం(gold), వెండి (silver) ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే గత రెండు రోజులుగా తగ్గిన వీటి ధరలకు బ్రేక్ పడింది. బలమైన గ్లోబల్ ట్రెండ్, స్థానిక నగల వ్యాపారుల డిమాండ్ సహా పలు అంశాల నేపథ్యంలో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తిరిగి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ. 290 పెరిగి రూ.77,680కి చేరుకుంది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర రెండు వేలకుపైగా తగ్గడం విశేషం.
ఇవే ఈరోజు ధరలు
ఇదే సమయంలో నేడు (నవంబర్ 28న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,520కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,060కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77,680కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,210 స్థాయికి చేరుకుంది. మరోవైపు వెండి రేటు కూడా కిలోకు 200 రూపాయలకుపైగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
వడోదరలో రూ. 77,570, రూ. 71,110
చెన్నైలో రూ. 77,520, రూ. 71,060
విజయవాడలో రూ. 77,230, రూ. 70,790
హైదరాబాద్‌లో రూ. 77,520, రూ. 71,060
ఢిల్లీలో రూ. 77,680, రూ. 71,210
బెంగళూరులో రూ. 77,570, రూ. 71,110
కేరళలో రూ. 77,570, రూ. 71,110
ముంబైలో రూ. 77,570, రూ. 71,110
పూణేలో రూ. 77,570, రూ. 71,110
కోల్‌కతాలో రూ. 77,570, రూ. 71,110
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
అయోధ్యలో రూ. 90,100
ఢిల్లీలో రూ. 90,100
హైదరాబాద్‌లో రూ. 98,100
విజయవాడలో రూ. 98,100
చెన్నైలో రూ. 98,100
ముంబైలో రూ. 90,100
కేరళలో రూ. 98,100
కోల్‌కతాలో రూ. 90,100
అహ్మదాబాద్‌లో రూ. 90,100
భువనేశ్వర్‍లో రూ. 98,100
వడోదరలో రూ. 90,100
పాట్నాలో రూ. 90,100
సూరత్‌లో రూ. 90,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
SBI ATMs: ఏటీఎంలలో సాంకేతిక సమస్యతో లక్షల రూపాయలు లూటీ.. అలర్ట్ చేసిన బ్యాంక్
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More Business News and Latest Telugu News