Gold and Silver Rates Today: బాబోయ్.. మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్ రేట్లు
ABN , Publish Date - Dec 29 , 2024 | 06:32 AM
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ఇంకో రెండు రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. ఇదే సమయంలో బంగారం (gold), వెండి (silver) ధరలు పెరుగుతూ, తగ్గుతున్నాయి. ఈ క్రమంలో నిన్న తగ్గిన ఈ ధరలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో ఈరోజు (డిసెంబర్ 29న) ఉదయం 6.20 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 240 పెరిగి రూ. 76,740కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,098కి చేరింది.
మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 76,720కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,327కు చేరింది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలో వెండి రూ. 1260 తగ్గి రూ. 88,600 స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ముంబైలో రూ. 76,600, రూ. 70,217
ఢిల్లీలో రూ. 76,740, రూ. 70,098
హైదరాబాద్‌లో రూ. 76,720, రూ. 70,327
విజయవాడలో రూ. 76,720, రూ. 70,327
కోల్‌కతాలో రూ. 76,500, రూ. 70,125
చెన్నైలో రూ. 76,820, రూ. 70,418
బెంగళూరులో రూ. 76,660, రూ. 70,272
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
చెన్నైలో రూ. 89,010
ఢిల్లీలో రూ. 88,600
ముంబైలో రూ. 88,750
కోల్‌కతాలో రూ. 88,640
హైదరాబాద్‌లో రూ. 88,890
విశాఖపట్నంలో రూ. 88,890
బెంగళూరులో రూ. 88,820
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలాగో తెలుసా..
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ 24కి మించదు, క్యారెట్ ఎక్కువైతే బంగారం స్వచ్ఛంగా ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే ముందు మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలు కలిగి ఉండవు.
ఇవి కూడా చదవండి:
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Manmohan Singh Net Worth: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Read More Business News and Latest Telugu News