Good news: ఈ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై వారానికి 5 రోజులే పనిదినాలు!
ABN , Publish Date - Mar 09 , 2024 | 09:03 AM
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు ఉద్యోగులకు(bank employees) పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరించిందని ఐబీఏ చీఫ్ పేర్కొన్నారు. దీంతోపాటు బ్యాంకు ఉద్యోగుల జీతాల్లో కూడా వార్షికంగా 17% పెరుగుదల ఉంటుందని ప్రకటించారు.
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు ఉద్యోగులకు(bank employees) పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరించిందని ఐబీఏ(IBA) చీఫ్ పేర్కొన్నారు. దీంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ఉద్యోగుల జీతాల్లో వార్షికంగా 17% పెరుగుదల ఉంటుందని చెప్పారు. నవంబర్ 2022 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.
అంతేకాదు అన్ని శనివారాలను సెలవు దినాలుగా(5 days working) మంజూరు చేసేందుకు కూడా అంగీకరించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది. కానీ ప్రభుత్వ నోటిఫికేషన్ తర్వాత పని వేళల సవరణ ప్రతిపాదన అమలులోకి రానుంది. అయితే ఈ నెలాఖరులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)కు ముందే బ్యాంక్ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వారానికి ఐదు రోజుల దినాలను ప్రభుత్వం ఆమోదించవచ్చని అంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Parachute Failed: సాయం కోసం పంపిన పారాచూట్ విఫలమై ఐదుగురు మృతి
శుక్రవారం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), బ్యాంక్ ఉద్యోగుల సంస్థల మధ్య వార్షిక వేతనాల పెంపుపై(wage hike) 17 శాతం ఒప్పందం కుదిరింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఏటా రూ.8,284 కోట్ల అదనపు భారం పడనుంది. బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంస్థలతో సంప్రదించి వార్షిక వేతనాన్ని IBA సవరిస్తుంది. 8088 మార్కుల డియర్‌నెస్ అలవెన్స్ (DA), దానిపై అదనపు వెయిటేజీని చేర్చడం ద్వారా కొత్త పే స్కేల్ నిర్ణయించబడింది. కొత్త వేతన పరిష్కారం ప్రకారం మహిళా ఉద్యోగులందరూ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వకుండానే ప్రతి నెలా ఒక రోజు సిక్ లీవ్ తీసుకునేందుకు అనుమతించబడుతుంది. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో లేదా సర్వీస్ సమయంలో మరణించిన సమయంలో ప్రివిలేజ్ లీవ్ (PL)ని 255 రోజుల వరకు ఎన్‌క్యాష్ చేసుకోవచ్చని ప్రకటించారు.
ఈ రోజు బ్యాంకింగ్ పరిశ్రమకు ఒక ముఖ్యమైన మైలురాయని ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా సోషల్ మీడియా(social media) వేదికగా వెల్లడించారు. IBA, UFBU, AIBOU, AIBASM, BKSM బ్యాంకు అధికారులు, ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 9వ జాయింట్ నోట్, 12వ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది నవంబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తుందని వెల్లడించారు.