Share News

Google Lay Off : గూగుల్‌లో మరిన్ని ఉద్యోగాల కోత

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:24 AM

అమెరికా టెక్‌ కంపెనీల్లో కొలువుల కోత కొనసాగుతోంది. అంతర్జాతీయ సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం ‘గూగుల్‌’ తన ఉన్నతోద్యోగుల్లో 10 శాతం మందిని ఇంటికి పంపిస్తోంది.

Google Lay Off : గూగుల్‌లో మరిన్ని ఉద్యోగాల కోత

న్యూయార్క్‌: అమెరికా టెక్‌ కంపెనీల్లో కొలువుల కోత కొనసాగుతోంది. అంతర్జాతీయ సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం ‘గూగుల్‌’ తన ఉన్నతోద్యోగుల్లో 10 శాతం మందిని ఇంటికి పంపిస్తోంది. వీరంతా మేనేజర్లు, డైరెక్టర్లు, వైస్‌ ప్రెసిడెంట్ల స్థాయిలో ఉన్న ఉన్నతోద్యోగులని సమాచారం. గూగుల్‌ కంపెనీ ఉద్యోగాల్లో కోత పెట్టడం ఈ సంవత్సరం ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరి, జూన్‌లోనూ కంపెనీ అనేక వందల మందిని ఇంటికి పంపించింది. ఓపెన్‌ ఏఐ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గూగుల్‌ ఈ చర్య తీసుకున్నట్టు భావిస్తున్నారు.

Updated Date - Dec 21 , 2024 | 04:24 AM