ఇక నుంచి అధికారికంగా వసూళ్ల వివరాల వెల్లడి బంద్
ABN , Publish Date - Jul 02 , 2024 | 01:53 AM
వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) వసూళ్లలో వృద్ధి రేటు కొనసాగుతోంది. జూన్ నెలలో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా నమోదైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి...
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) వసూళ్లలో వృద్ధి రేటు కొనసాగుతోంది. జూన్ నెలలో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా నమోదైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.7 శాతం ఎక్కువ. అయితే మే నెల వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం గత నెల వసూళ్లలో పెద్ద పెరుగుదల లేదు. ఈ నెల నుంచి ఇక అధికారికంగా ప్రతి నెలా 1వ తేదీన అంతకు ముందు నెల జీఎ్‌సటీ వసూళ్ల సమగ్ర వివరాల విడుదలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫుల్‌స్టాప్ పెడుతోందని ఆ వర్గాలు తెలిపాయి. వివిధ సోషల్ మీడియా చానల్స్ ద్వారా టూకీగా మాత్రమే ఇక ఈ వివరాలు విడుదలవుతాయి. ఇందుకు కారణం మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు.
కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే జీఎ్‌సటీ వసూళ్లు రూ.5.57 లక్షల కోట్లకు చేరాయి. జూన్‌లో వసూలైన రూ.1.74 లక్షల కోట్ల జీఎ్‌సటీలో సీజీఎస్‌టీ ద్వారా రూ.39,586 కోట్లు, ఎస్‌జీఎ్‌సటీ ద్వారా రూ.33,548 కోట్లు వసూలయ్యాయి.