Share News

పబ్లిక్‌ ఇష్యూకి హీరో మోటార్స్‌

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:37 AM

హీరో మోటార్స్‌ కంపెనీ (హెచ్‌ఎంసీ) గ్రూప్‌ ఆటో కాంపోనెంట్స్‌ సంస్థ హీరో మోటార్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియం త్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ)...

పబ్లిక్‌ ఇష్యూకి హీరో మోటార్స్‌

రూ.900 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: హీరో మోటార్స్‌ కంపెనీ (హెచ్‌ఎంసీ) గ్రూప్‌ ఆటో కాంపోనెంట్స్‌ సంస్థ హీరో మోటార్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియం త్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఈ ఇష్యూలో భాగంగా కొత్త ఈక్విటీ షేర్లు జారీ చేయటం ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అలాగే ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూ.400 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా ఓపీ ముంజాల్‌ హోల్డింగ్స్‌ రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుం డగా భాగ్యోదయ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, హీరో సైకిల్స్‌ చెరో రూ.75 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నాయి. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తాల్లో రూ.202 కోట్లను రుణ చెల్లింపుల కోసం వినియోగించనుండగా రూ.125 కోట్లను ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం వెచ్చించనుంది.

Updated Date - Aug 25 , 2024 | 05:37 AM