Share News

సబ్బులు మరింత ప్రియం ఎనిమిది శాతం వరకు పెంపు

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:53 AM

దేశంలో సబ్బుల ధర పెరిగింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌), విప్రో కన్స్యూమర్‌, గోద్రెజ్‌తో సహా అన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు స్నానపు సబ్బుల ధర ఏడు నుంచి ఎనిమిది శాతం పెంచేశాయి.

సబ్బులు మరింత ప్రియం ఎనిమిది శాతం వరకు పెంపు

న్యూఢిల్లీ: దేశంలో సబ్బుల ధర పెరిగింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌), విప్రో కన్స్యూమర్‌, గోద్రెజ్‌తో సహా అన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు స్నానపు సబ్బుల ధర ఏడు నుంచి ఎనిమిది శాతం పెంచేశాయి. సబ్బుల తయారీలో ప్రధాన ముడి పదార్థమైన పామాయిల్‌ ధర 35 నుంచి 40 శాతం పెరగడంతో కంపెనీలు ఈ చర్య తీసుకున్నాయి. స్నానపు సబ్బుల ధరతో పాటు చర్మ సంరక్షణ క్రీమ్‌ల ధరలను కూడా కంపెనీలు పెంచాయి. కొన్ని కంపెనీలు ఒక్కసారిగా ఏడెనిమిది శాతం పెంచితే, కొన్ని కంపెనీలు దశలవారీగా పెంచేందుకు నిర్ణయించాయి. ఒకేసారి పెంచితే డిమాండ్‌ తగ్గే ప్రమాదం ఉందని కంపెనీల భయం. ప్రతికూల వాతావరణంతో ఉత్పత్తి తగ్గడంతో ఇటీవల ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కాఫీ, టీ పొడి ధరలనూ 25 శాతం వరకు పెంచాయి.

Updated Date - Nov 30 , 2024 | 05:53 AM