Share News

ఈప్యాక్‌ డ్యూరబుల్స్‌లో హైసెన్స్‌కు వాటా !

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:59 AM

చైనాకు చెందిన బహుళజాతి అప్లయెన్సెస్‌, ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీ హైసెన్స్‌ గ్రూప్‌.. భారత్‌కు చెందిన కాంట్రాక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థ ఈప్యాక్‌ డ్యూరబుల్స్‌లో...

ఈప్యాక్‌ డ్యూరబుల్స్‌లో హైసెన్స్‌కు వాటా !

న్యూఢిల్లీ: చైనాకు చెందిన బహుళజాతి అప్లయెన్సెస్‌, ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీ హైసెన్స్‌ గ్రూప్‌.. భారత్‌కు చెందిన కాంట్రాక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థ ఈప్యాక్‌ డ్యూరబుల్స్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం వాటా విక్రయానికి సంబంధించి హైసెన్స్‌తో చర్చలు ప్రాధమిక దశలో ఉన్నాయని ఈప్యాక్‌ వెల్లడించింది. రూమ్‌ ఎయిర్‌ కండీషనర్స్‌లో ఈప్యాక్‌ డ్యూరబుల్‌.. భారత్‌లోనే రెండో అతిపెద్ద ఒరిజినల్‌ డిజైన్‌ మాన్యుఫ్యాక్చరర్‌ (ఓడీఎం)గా ఉంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావటంతో పాటు కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కంపెనీ డెహ్రడూన్‌, భివాడీ, శ్రీసిటీ ప్లాంట్లలో రూమ్‌ ఎయిర్‌ కండీషనర్లు, చిన్న గృహోపకరణ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తోంది.

Updated Date - Dec 26 , 2024 | 06:00 AM