హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది..
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:55 AM
దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి జపాన్‌కు చెందిన హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ కూడా ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న....
బెంగళూరు: దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి జపాన్‌కు చెందిన హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ కూడా ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ మోడల్ యాక్టివాలో ఎలక్ట్రిక్ వెర్షన్‌తోపాటు క్యూసీ1 అనే కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ను బుధవారం ఆవిష్కరించింది. వీటి బుకింగ్ సౌకర్యం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని, ఫిబ్రవరి నుంచి కస్టమర్లకు వాహనాలను అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అయితే, వీటి ధరలను మాత్రం వెల్లడించలేదు.