Share News

పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌పై జీఎ్‌సటీ సర్దుబాటు ఎలా..?

ABN , Publish Date - Jun 30 , 2024 | 01:04 AM

లక్ష్మీ సిమెంట్స్‌ అనేక ప్రాంతాల్లో డీలర్స్‌ను కలిగి ఉంది. వ్యాపార విస్తరణలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయడంతోపాటు డీలర్స్‌ నెట్‌వర్క్‌ను కూడా గణనీయంగా పెంచుకుంది.

పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌పై జీఎ్‌సటీ సర్దుబాటు ఎలా..?

డీలర్స్‌, స్టాకిస్టులకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా అమ్మకాలు పెంచుకునేందుకు చాలా కంపెనీలు పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ను ప్రకటిస్తుంటాయి. మరి ఈ డిస్కౌంట్‌ను జీఎ్‌సటీలో ఎలా చూపించాలో తెలుసుకుందాం..

క్ష్మీ సిమెంట్స్‌ అనేక ప్రాంతాల్లో డీలర్స్‌ను కలిగి ఉంది. వ్యాపార విస్తరణలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయడంతోపాటు డీలర్స్‌ నెట్‌వర్క్‌ను కూడా గణనీయంగా పెంచుకుంది. అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీ తన డీలర్స్‌కు పలు ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది. ఒకటి కంపెనీ నుంచి కొనుగోళ్లపై డీలర్‌కు డిస్కౌంట్‌ ఇచ్చే స్కీమ్‌. రెండో పథకంలో నెల, త్రైమాసిక, వార్షిక కొనుగోళ్ల టార్గెట్‌ను చేరుకున్న ఆధారంగా వారికి డిస్కౌంట్‌ అమలయ్యేలా చూడటం. అంటే, అమ్మకం జరిగిన తర్వాత డీలర్స్‌కు డిస్కౌంట్‌ ఇవ్వడం. ఇది కంపెనీకి, డీలర్‌కు మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఉంటుంది. ఉదాహరణకు, లక్ష్మీ సిమెంట్స్‌ తన డీలర్స్‌కు ఒక త్రైమాసికంలో 50 లక్షల మేర కొనుగోలు చేస్తే అదనంగా 3 శాతం డిస్కౌంట్‌, కోటి పైన కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్‌ కల్పిస్తోంది అనుకుందాం.

జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం, ఇన్వాయి్‌సలో చూపే మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, అమ్మకం జరిగే నాటికే ఇన్వాయిస్‌ జారీ చేసి ఉండాలి. కాబట్టి, పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ను ఇన్వాయి్‌సలో చూపించడం జరగదు. ఎందుకంటే, ఒప్పందం ప్రకారం నిర్ణీత మొత్తం కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. లక్ష్మీ సిమెంట్స్‌ విషయానికొస్తే, త్రైమాసిక కొనుగోళ్ల ఆధారంగా డీలర్స్‌కు ఇవ్వాల్సిన పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ను లెక్కించేందుకు చాలా సమయం పడుతుంది. ఆ తరువాత డిస్కౌంట్‌కు సరిపోను క్రెడిట్‌ నోట్‌ను జీఎ్‌సటీ కలిపి జారీ చేయడం జరుగుతుంది. అప్పటికే జరిపిన కొనుగోళ్లకు సంబంధించి ఆ డీలర్‌, కంపెనీకి ఇన్వాయిస్‌ మొత్తం జీఎ్‌సటీతో సహా చెల్లించడం.. కంపెనీ ఆ మొత్తంపై జీఎ్‌సటీ చెల్లించడంతోపాటు సదరు డీలర్‌ చెల్లించిన జీఎ్‌సటీని ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) రూపంలో పొందడం జరుగుతుంది. అంటే, అదనపు డిస్కౌంట్‌తోపాటుగా సంబంధిత జీఎ్‌సటీని కూడా కంపెనీ సదరు లర్‌కు వెనక్కి ఇచ్చేస్తుంది. ఆ సందర్భంలో కంపెనీ తాను చెల్లించిన జీఎ ్‌సటీని ఎలా వెనక్కి పొందాలి..? దీనికి జీఎ్‌సటీ చట్టంలో కొన్ని నియమాలున్నాయి. దీని ప్రకారం, పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌పై జీఎ్‌సటీలో మినహాయింపు పొందాలంటే, ముందుగానే ఆ మేర ఒప్పందం జరిగి ఉండాలి.

అన్నిటి కంటే ముఖ్యంగా, సదరు డీలర్‌ తీసుకున్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌కు వర్తించే మేర రివర్స్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడే కంపెనీ తను డీలర్‌కు ఇచ్చిన డిస్కౌంట్‌కు సరిపడా జీఎ్‌సటీని తగ్గించుకోగలదు. అయితే, డీలర్‌ జీఎ్‌సటీని రివర్స్‌ చేశాడా..? లేదా..? అని తెలుసుకోవడానికి కంపెనీ దగ్గర ఎలాంటి సదుపాయం లేదు. దాంతో జీఎ్‌సటీ ఆడిట్‌ లేదా ఎంక్వయిరీలు జరిగినప్పుడు చాలా కంపెనీలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈమధ్యనే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. సంబంధిత డీలర్‌ తన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లేదా కాస్ట్‌ అకౌంటెంట్‌ ద్వారా డిస్కౌంట్‌ తీసుకున్న మేర ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను రివర్స్‌ చేసినట్లు కంపెనీకి సర్టిఫికేట్‌ ఇవ్వాలి. అందులో క్రెడిట్‌ నోట్‌, ఇన్వాయిస్‌ వివరాలు, రివర్స్‌ చేసిన ఐటీసీ మొత్తం, ఏ విధంగా రివర్స్‌ చేయడం జరిగిందన్న వివరాలను పొందుపర్చాలి. ఆడిట్‌ లేదా ఎంక్వయిరీ సమయాల్లో ఆయా కంపెనీలు ఈ సర్టిఫికేట్‌ను ఆధారంగా చూపవచ్చు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో సరఫరాదారుడు తన డీలర్‌కు ఇచ్చిన పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌కు సంబంధించిన జీఎ్‌సటీ మొత్తం రూ.5 లక్షల లోపే ఉంటే గనుక, ఆ డీలర్‌ సీఏ లేదా కాస్ట్‌ అకౌంటెంట్‌ల ద్వారా కాకుండా తనే స్వయంగా పైన తెలిపిన వివరాలతో కూడిన సర్టిఫికేట్‌ను జారీ చేయవచ్చు. కాబట్టి, పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ కల్పించే కంపెనీలు తమ డీలర్ల నుంచి ఈ విధంగా సర్టిఫికేట్‌లను పొందాలి. అలాగే, గడిచిన సంవత్సరాలకూ ఈ సర్టిఫికేట్‌లను తీసుకోవాలి.

Updated Date - Jun 30 , 2024 | 01:04 AM